ఎండ నీడను జూసే
మా అమ్మమ్మ పొద్దు చెప్పేది...
ఓ పక్క పొయ్యికాడ అన్నమండుకుంటనే
ఇంకో పక్క సల్ల జేస్కచ్చేది...
అంటింట్ల తడ్కకు ఎనుకులాడకుండా
సూది గుచ్చిపెట్టేది...
మా తాత తాళం చెయ్ మొల్దారానికి కట్టుకుంటే
అమ్మమ్మ నష్యం సీస బొడ్లెసంచిల ఏసుకునేది
సాయమాన్ల కట్టెల పొయ్యి కాడి పీటనే
మా అమ్మమ్మకు సింహాసనం ఐతే
కట్ట మీంచి ఎడ్ల బండ్లె పొలం కానికి
యుద్ధానికి పోయే రాజు మా �