కరీంనగర్ బల్దియా పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సోమవారంతో నాలుగేళ్లు పూర్తవుతున్నది. పాలకవర్గం నాలుగేళ్లలో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది.
ప్రగతి మార్గాలైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎనిమిదేండ్లలో రూ.16,231 కోట్లతో 9,616 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టింది.