నాడు గుంతలు.. నేడు కొత్త పుంతలు
ప్రగతి మార్గాలైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎనిమిదేండ్లలో రూ.16,231 కోట్లతో 9,616 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టింది.
- రోడ్లకు ఎనిమిదేండ్లలో 16,231 కోట్లు
- 9,578 కి.మీ. కొత్త రహదారుల నిర్మాణం
- 11,814 కోట్లతో వాగులపై వంతెనలు
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ప్రగతి మార్గాలైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎనిమిదేండ్లలో రూ.16,231 కోట్లతో 9,616 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టింది. రూ.11,814 కోట్లతో వంతెనలు నిర్మిస్తున్నది. వీటిల్లో ఇప్పటికే 80 శాతంపైగా పనులు పూర్తికాగా, మరో రూ.1,000 కోట్లతో 512 రహదారుల అభివృద్ధి పనులు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నరకానికి నకళ్లుగా ఉన్న తెలంగాణలోని రహదారులు, ఇప్పుడు అభివృద్ధికి వారధులుగా మారాయి. నాడు తెలంగాణలో 70 శాతం సింగిల్ లేన్ రహదారులే ఉండేవి. నేడు గ్రామాల్లో సైతం డబుల్ లేన్ రోడ్లు కనిపిస్తున్నాయి.
వేల కోట్లతో రోడ్ల నిర్మాణం
- రోడ్లు, భవనాలశాఖ రూ.16,231 కోట్లతో 9,616 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇప్పటివరకు 7,578 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసింది.
- అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 459 మండలాలుండగా, 145 మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్ కనెక్టివిటీ సరిగా లేదు. దీంతో రూ.2,655 కోట్లతో 1,835 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 1,651 కిలోమీటర్ల మేర 139 రోడ్ల నిర్మాణం పూర్తయింది.
- ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా 5,574 కిలోమీటర్ల మేజర్ జిల్లా రోడ్లు, స్టేట్ హైవేలు, కోర్ నెట్వర్క్ రోడ్లను రూ.10,380 కోట్లతో డబుల్ లేన్ రోడ్లుగా విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 4,389 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు.
- హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కోసం 38 కిలోమీటర్ల రేడియల్ రోడ్లను రూ.761.62 కోట్లతో నిర్మించారు. సెంట్రల్ రోడ్ ఫండ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2,345 కోట్లతో 2,169 కిలోమీటర్ల పనులు చేపట్టి 1,500 కిలో మీటర్ల పనులు పూర్తి చేసింది. ఇందులో 7,180 కిలోమీటర్లు డబుల్ లేన్రోడ్లు.. 359 కిలోమీటర్లు నాలుగు లేన్ల రోడ్లు, 39 కిలోమీటర్లు ఆరులేన్ల రోడ్లు పూర్తయ్యాయి.
- రూ.11,814 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పెద్ద నదులపై 26 భారీ వంతెనల నిర్మాణానికి రూ.9,084 కోట్లు కేటయించింది. ఇప్పటి వరకు16 వంతెనల నిర్మాణం పూర్తయింది.
- వాగులు, వంకలపై రూ.2,730 కోట్లతో 510 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టిన రోడ్లు భవనాల శాఖ, ఇప్పటి వరకు 430 బ్రిడ్జిలను పూర్తి చేసింది. వీటిలో 184 బ్రిడ్జిలను చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జిలుగా చేపట్టి, 130 చోట్ల పనులు పూర్తిచేసింది.
- రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో 27,461 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో 7,638 కిలోమీటర్ల రోడ్లకు రూ.2,575 కోట్లతో సాధారణ మరమ్మతులు చేపట్టి 6,181 కిలో మీటర్ల మేర పనులు పూర్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

