గిరిజన యువతకు ఇప్పటికే మంజూరైన ట్రైకార్ రుణాలు రూ.219 కోట్లను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను సోమవారం ముట్టడించింది.
2019-21 సంవత్సరాల్లో మంజూరైన ట్రైకార్ రుణాలకు సంబంధించి రూ.219 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిరిజన సంఘాల జేఏసీ ఏడాదిగా డిమాండ్ చేస్తున్నది.