తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(సవరణ) బిల్లు-2023కు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభల�