Tribal University | ములుగు గిరిజన వర్సిటీకి రాజ్యసభ ఆమోదం.. ఆ తర్వాతే యూనివర్సిటీ స్థాపన..!
తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(సవరణ) బిల్లు-2023కు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(సవరణ) బిల్లు-2023కు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు గత వారమే లోక్సభ ఆమోదించింది. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో హామీ ఇచ్చిన ప్రకారం ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రానున్న రోజుల్లో ప్రాంతీయ ఆకాంక్షలను ఈ వర్సిటీ నెరవేర్చనుంది. ఈ యూనివర్సిటీ ఉన్నత విద్య అందుబాటును, నాణ్యతను, తెలంగాణ ప్రజల పరిశోధనా సౌకర్యాలను పెంపొందిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. భారతదేశ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలపై ఈ యూనివర్సిటీలో పరిశోధనలు చేసే అవకాశం లభించనుంది. ఈ యూనివర్సిటీని రూ.889.07 కోట్లతో నెలకొల్పనున్నారు.
ఇందుకోసం ములుగు సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. బిల్లు ఆమోదం పొందిన సమయంలో పార్లమెంట్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా ఐఐటీలు, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల డ్రాపౌట్ రేటు పెరుగుతున్నదని సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ వారికి వేరే మంచి అవకాశాలు రావడం, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభించడం ఇందుకు ఒక కారణమని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

