ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది
రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతు దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.