ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది.
‘శ్రీరాముడు నడయాడిన పుణ్య భూమిగా పిలిచే అయోధ్యలో ఉన్న అన్ని ఆలయాలు, మఠాలకు పన్నులు రద్దు చేస్తున్నాం’ అంటూ 2022లో ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే.. భూమి శిస్తు, తాగ