ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు.
సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు.