అప్పటికే రాకుమారికి ప్రేతస్నానం చేయిస్తున్నారు. పాముకాటుకు గురవ్వగానే.. అమాంతం విరుచుకు పడిపోయిందామె. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చనిపోయిందని ప్రకటించారు.
పుష్పకేతుడు, అతని నలుగురు సోదరులూ... దక్షిణ దిగ్విజయయాత్రలో భాగంగా ఆంధ్ర, కర్ణాటక, కేరళ దేశాలలోని విశేషాలను చూశారు. కాంచీ క్షేత్రాన్ని సేవించి, పాండ్యదేశం మీదుగా స్త్రీరాజ్యాన్ని చేరుకున్నారు.