Urea | ముందస్తు వర్షాలు పడడంతో మురిసిన రైతులు, అటు తరువాత వర్షాలు లేక నారు మల్లు, పత్తి మొక్కజొన్న మొలకలు ఎండిపోతుంటే ఆందోళన చెందిన రైతులు, నేడు యూరియా కోసం వానలో తడుస్తూ లైన్లు కట్టే పరిస్థితి ఎదురైంది.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం ప్రాంత రైతులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వెళ్లే ప్రధాన కాల్వకు ఇటీవల నీళ్లు విడుదల చేశారు.