రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నంబర్లో 103.35 ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పంచాయతీలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సరారును హైకోర్టు ఆదేశించింది. మండల పంచాయతీ అధికారి, కార్యదర్శుల అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీస