కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో గురువారం హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానకార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Governor Tamilisai) ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం (Swachhta Abhiyan) చేశారు.