నా అచ్చయిన పుస్తకాలలో మొట్టమొదటిది ‘అగ్నిధార’ సాహితీ మేఖల పక్షాన 1949లో అచ్చయింది. సాహితీ మేఖల చాలామంది కవులను సృష్టించింది. సాహితీ మేఖల సభ్యులు నల్లగొండ ప్రాంతంలో కలిగించిన సంచలనం మరువరానిది.
‘తెలంగాణం తెలుగు తల్లి అందాల కొప్పు, ఆ తల్లి తన కొప్పులో ముద్దుగా ముడుచుకున్న ఒక మల్లె మన భార్గవుడ’ని ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మచే ప్రశంసలందుకున్న సిరిప్రెగడ భార్గవరావు నల్గొండ జిల్లా చండూరు మండల�