Dasarathi | ‘అగ్నిధార’లు కురిపించిన అక్షర పయోనిధి
నా అచ్చయిన పుస్తకాలలో మొట్టమొదటిది ‘అగ్నిధార’ సాహితీ మేఖల పక్షాన 1949లో అచ్చయింది. సాహితీ మేఖల చాలామంది కవులను సృష్టించింది. సాహితీ మేఖల సభ్యులు నల్లగొండ ప్రాంతంలో కలిగించిన సంచలనం మరువరానిది.
Dasarathi | నా అచ్చయిన పుస్తకాలలో మొట్టమొదటిది ‘అగ్నిధార’ సాహితీ మేఖల పక్షాన 1949లో అచ్చయింది. సాహితీ మేఖల చాలామంది కవులను సృష్టించింది. సాహితీ మేఖల సభ్యులు నల్లగొండ ప్రాంతంలో కలిగించిన సంచలనం మరువరానిది. సభలు, సమావేశాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, సన్మానాలు, సత్కారాలు.. ఇల్లూ వాకిలీ మరచి నెలల తరబడి కవులు ఆ ప్రాంతాల్లోనే గోష్ఠులు జరుపుతూ కాలక్షేపం చేసేవారు. అన్నిరకాల కవులూ ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరి రచనను విని ఒకరు ఆనందించడం వుండేది.
ఒకళ్లు అగ్ని కురిపిస్తే, ఒకరు వెన్నెల విరియించేవారు. ఒకరిది గంగా ప్రవాహం అయితే, ఒకరిది సెలయేరు. ఒకరు ఝంఝామారుతం అయితే ఒకరు మలయానిలం.. ఒకరు ఇంద్రకార్ముకాన్ని గూర్చి వ్రాస్తే ఒకరు కార్మికుణ్ని గురించి వ్రాసేవారు. దేవులపల్లి రామానుజరావు చక్కని కవి. అందుకు ఆయన పచ్చతోరణమే సాక్షి. సిరిప్రెగడ భార్గవరావు కమ్మని పద్యాలు వ్రాసి శ్రావ్యంగా చదివేవాడున్నూ. ధవళా శ్రీనివాసరావు చాలా రాశాడు. పులిజాల హనుమంతరావు ఎక్కువగాకున్నా కొంత రాశాడు. గడియారం రామకృష్ణ కంఠం ఎత్తి కావ్యం ఆలపిస్తే వేలాది సభాసదులు మంత్రముగ్ధులై వినేవారు.
– దాశరథి
నల్లగొండ జిల్లా చండూరు ప్రాంతంలో 1934లో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి స్థాపించిన ‘సాహితీ మేఖల’ ఎందరినో ప్రభావితం చేసింది. ఈ సంస్థకు పట్టుగొమ్మల్లాంటి వారిలో దవళా శ్రీనివాసరావు, పులిజాల హనుమంతరావు, సిరిప్రెగడ భార్గవరావు, మద్దోజు సత్యనారాయణ, పులిజాల గోపాలరావులతో పాటు దాశరథి కూడా ఉన్నారు. దాశరథి ‘అగ్నిధార’ అయితే దవళశ్రీ ‘అమృతధార’ అని చెప్పుకొంటారు. సాహితీ మేఖలతో సాన్నిహిత్యం పెంచుకున్న దాశరథి నాడు వెలువడిన మాతృభూమి, ప్రజామిత్ర, గోలకొండ, సారథి, అభ్యుదయ, విశాలాంధ్ర వం టి పత్రికలలో ప్రచురింపబడిన కవితలన్నీ సంపుటీకరించి ‘అగ్నిధార’ పేరుతో సాహితీ మేఖల అచ్చేసింది. ఈ పవిత్ర కార్యానికి ప్ర ధాన కారకులు దేవులపల్లి రామానుజరావు.దాశరథి తన ‘అగ్నిధార’ కావ్యాన్ని వట్టికోట ఆళ్వార్స్వామికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా దాశరథి వట్టికోట గురించి ఇలా అంటారు.
మిత్రుని కోసం కంఠం ఇవ్వగలవాడు మంచికి పర్యాయపదం ఆళ్వార్ అతనిదే సార్థకమైన జీవితం అతనికి అగ్నిధార అంకితం
దాశరథి, వట్టికోట 1948లో మూడు నెలలు నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనతో మైత్రికి చిహ్నంగా ఈ అగ్నిధారను అంకితం చేసుకున్నానని వట్టికోట అన్నారు. అందుకే దాశరథిని ‘కవితా పయోనిధి’ అని వట్టికోట సంబోధించేవారు.
‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ అని నిజాంను నిలువెల్లా వణికించిన ఉద్యమకవి దాశరథి. ‘తెలంగాణము రైతుదే’ అని ఘం టాపథంగా ఎలుగెత్తి చాటిన ధీశాలి ఆయన. రుద్రవీణను మీటి, అగ్నిధారలు కురిపించి అభ్యుదయ కవితామార్గంలో పయనించిన దాశరథి ఎప్పటికీ చిరస్మరణీయుడే.
-పున్న అంజయ్య
9396610639
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

