సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి ఐదో విడతలో భాగంగా మంగళవా రం మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్టుకు నీటి పారుదల శాఖ అధికారులు సింగూరు జలాలను విడుదల చేశారు.
మూడు దశాబ్దాల రైతుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. సింగూరు జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో సింగూరు జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు.