స్వాతంత్య్రం వచ్చిన 76 ఏండ్లలో దళితుల ఉద్ధరణకు, అభ్యున్నతికి పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు (Dalith Bandhu) అందజేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.
రెండో విడత దళితబంధులో 162 దళిత కుటుంబాలకు స్వచ్ఛ వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత ఆదాయం లభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.