క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. సీనియర్ నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
సీనియర్ నటుడు ‘30 ఇయర్స్' పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కుమార్తె శ్రీలు కథానాయిక. క్రాంతి కృష్ణ కథానాయకుడు. చిత్రీకరణ పూర్తయింది.