సీనియర్ నటుడు ‘30 ఇయర్స్’ పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కుమార్తె శ్రీలు కథానాయిక. క్రాంతి కృష్ణ కథానాయకుడు. చిత్రీకరణ పూర్తయింది.
ఇటీవల ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పృథ్వీ మాట్లాడుతూ ‘ అన్ని వర్గాల వారిని అలరించే కంటెంట్‌తో రాబోతున్న చిత్రమిది. ప్రతి సీన్‌ను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాను. పాటలు కూడా ఆకట్టుకుంటాయి’ అన్నారు. విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణతేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ సంగీత ఆదిత్య.