ఇండోర్(మధ్యప్రదేశ్)లో జరిగిన 18వ ఆల్ఇండియా పోలీసు స్పోర్ట్స్ షూటింగ్ చాంపియన్షిప్లో పతక విజేతలను డీజీపీ జితేందర్ అభినందించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన వారిని సత్కరించారు.
అంతర్జాతీయ క్రీడా వేదికపై మరో తెలంగాణ క్రీడా తార తళక్కుమంది. తన గురికి తిరుగులేదని నిరూపిస్తూ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ పసిడి కాంతులు విరజిమ్మాడు. జర్మనీలో ఇటీవలే జరిగిన ప్రపంచ బధిర షూటింగ్ చాంపియన�