హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఇండోర్(మధ్యప్రదేశ్)లో జరిగిన 18వ ఆల్ఇండియా పోలీసు స్పోర్ట్స్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పతక విజేతలను డీజీపీ జితేందర్ అభినందించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన వారిని సత్కరించారు. షూటింగ్ టోర్నీలో తెలంగాణకు మొత్తం 7 పతకాలు వచ్చాయి. ఇందులో వ్యక్తిగత విభాగంలో రాజ్‌కుమార్‌కు రజతం, మహిళల టీమ్ ఈవెంట్లో సువర్ణ, విజయమ్మ, మాధవి రజతాలు గెలువగా, పురుషుల టీమ్ విభాగంలో శ్రీనివాసరావు, శ్యామ్ సుందర్, రాజ్‌కుమార్‌కు మూడు కాంస్యాలు వచ్చినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ(స్పోర్ట్స్) రమేశ్, డీఎస్పీ రామారావు పాల్గొన్నారు.