కెరీర్లో మంచి స్థాయిలో నిలదొక్కుకోవాలంటే విద్య అవసరం. అందుకు తగ్గట్టు బోధన మరీ ముఖ్యం. ఇలాంటి అత్యుత్తమ విద్యనందించే దేశాల్లో జపాన్ ఒకటిగా నిలిచింది.
భారతీయులు, అందునా సామాన్యులు విదేశాలకు వెళ్లి చదవడం, అక్కడ పరిశోధనలు చేయడమంటే మాటలతో అయ్యే పనికాదు. ఒకవేళ అలాంటి అవకాశం లభించినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది.