భారత పత్తి సంస్థ(సీసీఐ)కు పత్తిని అమ్మేందుకే రైతులు విముఖత చూపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ కొర్రీలు పెడుతుండటంతో విసిగివేసారి ప్రైవేటు బాట పడుతున్నారు.
ఆరుగాలం కష్టించి పత్తి పంట పండించడం ఒక ఎత్తయితే..చేతికందిన పంటను కాపాడి విక్రయించడం రైతన్నలకు మరో ఎత్తవువుతున్నది. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరుతూ, అధికారులు విధించే అనేక కొర్రీలతో