Telangana | రాష్ట్ర సర్కారు విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కోట్ల రూపాయలతో అవసరమైన మౌలిక వసతులు కల్పించింది. ‘మన ఊరు-మన బడి’ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడంతో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి.
వచ్చే విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలను ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు జతల యూనిఫాంలు ఇస్తుండగా, తాజాగా మూడు జతలు ఇవ్వాలన్న �