కొత్త డైరెక్టర్ శరత్ మండవతో టాలీవుడ్ యాక్టర్ రవితేజ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జులై 1 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
టాలీవుడ్ హీరో రవితేజ సినిమాలంటే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ ఏడాది క్రాక్ సినిమాతో కేక పుట్టించాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో శరత్ మండవ డైరెక్షన్ లో ఓ సినిమా మొదలుపెట్టాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డది.