ఆ ఊరికి వెళ్తే చుట్టూ ఇసుక డంపులే దర్శనమిస్తాయి.. నాలుగు దిక్కులా పెద్ద పెద్ద కుప్పలే కనిపిస్తాయి.. కానీ, రాత్రయితే మాత్రం అవన్నీ తరలిపోతాయి. కథలాపూర్ మండలం బొమ్మెన శివారులో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. �
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలంలోని మక్తా కొత్తగూడెం, ఏపూరు, రామన్నగూడెం వాగుల్లో నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.