Free Education | విద్యాహక్కు చట్టం 12(1)సీ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ఈ 25% సీట్లను పేద, అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాలి.
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద రాష్ర్టాలకు కేంద్రం విడుదల చేసే నిధులను జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో ముడిపెట్టవలసిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు రూలింగ్ ఇచ్చింది.