హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18: ఆర్టీసీలో ఎన్నికల నగారా మోగింది. సుమారు ఎనిమిదేళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం(యూనియన్) ఎన్నికలకు ఎట్టకేలకు ఆర్టీసీ యాజమాన్యం పచ్చజెండా ఊపింది.
త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టనున్నట్టు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వ�