ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి విజయఢంకా మోగించింది. సమ్మె విచ్ఛిన్నకర శక్తులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లేదంటూ ముక్తకంఠంతో వేలాదిమంది కార్మికులు ఓట్లతో నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
- గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి విజయఢంకా
- అర్ధరాత్రి వరకు ఐదు వేల ఓట్ల భారీ మెజారిటీ
- అధికారపార్టీ కూటమికి షాక్ ఇచ్చిన కార్మికులు
- 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
- 17న తుది ఫలితాల ప్రకటన
- రాత్రి 11.30 వరకు ఐదు వేల వరకు భారీ మెజారిటీ
- అధికారపార్టీ కూటమికి షాక్
- 14, 15న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. 17న తుది ఫలితాలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి విజయఢంకా మోగించింది. సమ్మె విచ్ఛిన్నకర శక్తులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లేదంటూ ముక్తకంఠంతో వేలాదిమంది కార్మికులు ఓట్లతో నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొదటి సమ్మె నోటీసు ఇచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధం సంఘాలు, నాయకులు చేసిన కుట్రలను ఎన్నికల సాక్షిగా కార్మికులు బట్టబయలు చేశారు. వేలాదిగా ఈయూ కూటమికి ఓట్లు వేయడంతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 115 డిపోల్లో నిర్వహించిన ఎన్నికల్లో దాదాపు 90% ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నా రు. శుక్రవారం రాత్రి 11.30 వరకు దాదాపు ఐదు వేల వరకు ఓట్ల మెజారిటీని ఈయూ కూటమి సొంతం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో అధికారపార్టీ కూటమి టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఘోర పరాభవం ఎదురైంది. కేవలం స్థానిక రీజియనన్లకే పరిమితం చేశారు. 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఏర్పాట్లుచేస్తామని, తుది ఫలితాలను 17న విడుదల చేస్తామని జాయింట్ లేబర్ కమిషనర్ సునీత తెలిపారు.
రాష్ట్రస్థాయిలో ఈయూ కూటమి హవా
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో ఈయూ కూటమి దూసుకెళ్లింది. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)కోసం ఉద్యమం చేపడతామని ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ సంఘాల నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భరోసా కల్పించారు. దీంతో కార్మికులు వారికే పట్టం కట్టారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ రీజియన్లలో థామస్‌రెడ్డి వర్గం ఆధిక్యం చూపింది. ఖమ్మంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి విజయం సాధించగా.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్.. రీజియన్లలో టీడబ్ల్యూయూకి స్థానిక గుర్తింపు దక్కింది.
రాష్ట్రస్థాయిలో గుర్తింపు కోసం అన్ని యూనియన్లు పోటీపడగా.. ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి భారీగా విజయం సాధించింది. దాదాపు 4వేల నుంచి ఐదు వేల వరకు ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. స్పష్టమైన మెజారిటీ రాని వరంగల్, సికింద్రాబాద్, హైదరాబాద్ రీజియన్లలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంఘమే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఈ లెక్కన అవి కూడా ఈయూ కూటమి ఖాతాలో చేరుతాయి.
రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంలో టీడబ్ల్యూయూ (అశ్వత్థామరెడ్డి) వర్గం రెండోస్థానంలో నిలిచింది. దీంతో కార్మికులు తమ డిపోల వారీగా పటాకులు కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు. భారీ విజయాన్ని అందించిన కార్మికులకు ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, ఎన్ఎంయూ నేతలు కమల్‌రెడ్డి, మౌలానా, నరేందర్‌రెడ్డి తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంగా విజయ బావుటా ఎగురవేయడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో ఉన్న కార్మిక సంఘాలకు అభినందనలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

