ఆర్టీసీ కార్మికలోకం కుతకుత
ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడుపుఠాణికి కారణమైన లేబర్ కమిషన్ ముందు ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి మహాధర్నా చేపట్టింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి మొన్నటి ఆర్టీసీ ఎన్నికల ఫలితాల వరకూ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా లేబర్ కమిషన్ మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ నిరసనలకు పిలుపునిచ్చారు.
- గుర్తిపు సంఘం ఎన్నికల ఫలితాల తారుమారుపై కన్నెర్ర
- నేడు లేబర్ కమిషన్ ఆఫీసు వద్ద భారీ ధర్నాకు జేఏసీ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడుపుఠాణికి కారణమైన లేబర్ కమిషన్ ముందు ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమి మహాధర్నా చేపట్టింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి మొన్నటి ఆర్టీసీ ఎన్నికల ఫలితాల వరకూ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా లేబర్ కమిషన్ మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ నిరసనలకు పిలుపునిచ్చారు. ఆదినుంచీ లేబర్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు తమను తీవ్రంగా కలచివేస్తున్నదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. నాడు జేఏసీగా సమ్మె నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని, ఆర్టీసీ ఉన్నతాధికారులను చర్చల్లో కూర్చోబెట్టడంలో విఫలమయ్యారని చెప్తున్నారు. ఆర్టీసీ ఎన్నికల ముందు.. టీఎంయూకు చెందిన బాణం గుర్తును టీడబ్ల్యూయూకు కేటాయించడంలో లేబర్ కమిషన్ అధికారులు చక్రం తిప్పారని అంటున్నారు. బాణం గుర్తుకు బదులు నిచ్చెన గుర్తు ఇచ్చినప్పటికీ టీఎంయూకే ఓట్లు వేసి డిపోల్లో గుర్తింపు సంఘంగా నిలబెట్టారు.
కొత్త నిబంధనలతో ఫలితాలు తారుమారు
ఈనెల 17న ఉదయమే ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాల్సిన లేబర్ కమిషన్ అధికారులు.. ప్రభుత్వ మద్దతు ఉన్న టీడబ్ల్యూయూకి లాభం చేకూర్చేలా రాత్రి ఫలితాలు విడుదల చేశారని కార్మిక నేతలు అంటున్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనపై సాక్షాత్తు కార్మిక శాఖ విధించిన నిబంధనలను లేబర్ కమిషన్ అధికారులే తుంగలోతొక్కి.. ప్రభుత్వ మద్దతు ఉన్న సంఘానికి అనుకూలంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఓట్ల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఓ కార్మిక సంఘం ఇచ్చిన ‘కమీషన్’కు ఆశపడ్డారని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు బహిరంగంగా ఆరోపించారు. గతంలో రాష్ట్రవ్యాప్త గుర్తింపు సంఘం, డిపోల్లో స్థానిక గుర్తింపు సంఘాన్ని ఎన్నిక చేయాలంటే కచ్చితంగా ఫైనల్ ఓటర్ లిస్టులను పరిగణనలోకి తీసుకొని..
మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా ఒక్క ఓటు వచ్చిన సంఘాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటించేవారు. ఆ ప్రకారం ఎక్కడైనా మెజారిటీ రాని డిపోల్లో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంఘమే అక్కడ కూడా గుర్తింపు సంఘంగా ఉండేది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిన సంఘానికి తక్కువ డిపోలు రావడం, రాష్ట్రవ్యాప్తంగానూ పేలవ ప్రదర్శన ఉండటంతో.. బొటాబొటిగా ఓట్లకు దగ్గరగా ఉన్న డిపోల్లో మొత్తం పోలైన ఓట్లలో నుంచి 50 శాతానికిపైగా ఒక్క ఓటు వచ్చిన సంఘానికి స్థానికంగా గుర్తింపు ఇచ్చే నిబంధనను తీసుకొచ్చారని కార్మిక నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు కార్మిక నేతలు ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి, ఎండీ మౌలానా చెప్పారు. ఈ భారీ ధర్నాకు కార్మికులు తరలిరావాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

