ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం భూ లావాదేవీల్లో 50 శాతం హైదరాబాద్లోనే జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ అనరాక్ గ్రూప్ తన అధ్యయనంలో వెల్లడించింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.