హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఇతర మెట్రో నగరాల కంటే మెరుగైన వృద్ధిరేటును కనబరుస్తోంది. తాజాగా 2023 తొలి త్రైమాసికంలో జరిగిన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సోవాలపై రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ అనరాక్ నివేదికను బుధవారం వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే కొత్త యూనిట్ల విక్రయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. 2023 త్రైమాసికంలో హైదరాబాద్లో 14, 280 కొత్త యూనిట్లు విక్రయించారని, అందులో 46 శాతం కొత్త ప్రాజెక్టుల నుంచే జరిగాయని తెలిపింది.
ఏడు ప్రధాన నగరాల్లో కొత్త విక్రయాల వాటా 41 శాతమే. హైదరాబాద్లో 2019 త్రైమాసికంలో 5400 విక్రయాలు జరిగితే, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు 28 శాతం ఉన్నాయని పేర్కొన్నారుప్రధాన నగరాలైన ఎన్సీఆర్-ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, ఫూణే, చెన్నై, కోల్కతా నగరాల కంటే హైదరాబాద్ నగరంలో కొత్త యూనిట్ల అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి రేటు నమోదైందని అనరాక్ పేర్కొంది.