‘విష్ణు విన్యాసం’ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా చక్కటి వినోదంతో అలరిస్తుందని చెప్పారు చిత్ర హీరో శ్రీవిష్ణు. నయన సారిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి యదునాథ్ మారుతీ రావు దర్శకుడు. సుమంత్ నాయుడు జి నిర్మాత. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం టీజర్‌ను లాంచ్ చేశారు. ఇందులో హీరో శ్రీవిష్ణు జాతకాలు, వాస్తు పిచ్చి ఉన్న యువకుడిగా కనిపించారు. అతని ప్రేమప్రయాణంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఈ క్రమంలో పండిన హాస్యం ఆకట్టుకునేలా ఉంది.
శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పిస్తుంది. ఓ ఉత్సవం లాంటి సినిమా ఇది. ఒంగోలు నేపథ్యంలో సరదా సంభాషణలతో అందరిని నవ్విస్తుంది’ అన్నారు. శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న చిత్రమిదని దర్శకుడు తెలిపారు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు మనసారా నవ్వుకుంటారని నిర్మాత సుమంత్ నాయుడు జి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రథన్, రచన-దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు.