Inflation | ఆహారోత్పత్తులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠం 4.81 శాతానికి చేరింది. వినిమయ ధరల సూచి ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం మే నెలలో 4.31 శాతంగా ఉంది.
దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగడం, ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌లు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను రిజర్వ్‌బ్యాంక్ పెంచవచ్చని మెజారిటీ విశ్లేషకులు అంచనా