ఆర్థిక రంగంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనప్పటికీ దశాబ్దాల చరిత్ర కలిగిన అనేక పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి తిరుగులేని శక్తిగా ఎదిగింది.
తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. కేంద్రం ఎటువంటి కొర్రీలు పెట్టనీ, కాలం కరోనా వంటి పరీక్షలను ఎన్నయినా నిలుపనీ.. ఆ చక్రం తిరుగుతునే ఉన్నది.