‘వాట్..!’ అశ్చర్యంతో షాకైన రుద్ర తనను తాను తమాయించుకొని.. ‘ఎలా? ఎప్పుడు?? హెడ్‌క్వార్టర్స్‌లో నాతో ఎవరూ ఈ విషయం అనలేదే?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. రుద్ర, శశాంక్ గతంలో రెండు మూడు కేసుల మీద కలిసి పనిచేశారు.
‘సార్.. ఇక్కడ ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొన్నారు. మీరు త్వరగా రండి’ ఫోన్లో కంగారుగా చెప్పాడు హోటల్ మేనేజర్ రవికాంత్. వెంటనే తన సిబ్బందితో క్రైమ్ స్పాట్‌కు చేరుకొన్నాడు రుద్ర.