SCR | పెద్దపల్లి జిల్లా రాఘవాపురం - రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బుధవారం రాత్రి అప్లైన్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ఎట్టకేలకు రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇటీవల వచ్చిన వరదలకు 418 కిలోమీటర్ రాయి వద్ద ట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే.