రిపబ్లిక్ వేడుకల్లో పంజాబ్రాష్ట్రానికి చెందిన శకటానికి స్థానం కల్పించకపోవడంపై మోదీ ప్రభుత్వంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మండిపడ్డారు. ఇది కేంద్ర హ్రస్వ దృష్టికి నిదర్శనమని విమర్శించారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రులు ప్రకాష్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీల కంటే కూడా ఆప్ సీఎం భగవంత్ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య ఎక్కువ అని కాంగ్రెస్ నేత బజ్వా ట్విట్టర్లో విమర్శించారు.