పంజాబ్ సీఎంకి 42 కార్ల కాన్వాయ్… ‘వీఐపీ సంస్కృతి’ అంటూ విపక్షాల విమర్శ
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రులు ప్రకాష్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీల కంటే కూడా ఆప్ సీఎం భగవంత్ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య ఎక్కువ అని కాంగ్రెస్ నేత బజ్వా ట్విట్టర్లో విమర్శించారు.
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఆయనకు 42 కార్ల కాన్వాయ్ ఉందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల ముందు చెప్పిన దానికి, ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా భిన్నంగా ఉన్నదని ఆరోపించాయి. భగవంత్ మాన్ ‘వీఐపీ సంస్కృతి’ని అనుసరిస్తున్నారని విమర్శించాయి. కాంగ్రెస్ నేత, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన పర్తాప్ సింగ్ బజ్వా ఆ రాష్ట్ర రవాణా కమిషనర్ ఇచ్చిన ఆర్టీఐ నివేదికను బయటపెట్టారు. సీఎం భగవంత్ మాన్కు 42 వాహనాల కాన్వాయ్ ఉన్నట్లు అందులో ఉంది.
కాగా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రులు ప్రకాష్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీల కంటే కూడా ఆప్ సీఎం భగవంత్ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య ఎక్కువ అని కాంగ్రెస్ నేత బజ్వా ట్విట్టర్లో విమర్శించారు. భగవంత్ మాన్ ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపై అధికార పార్టీలను విమర్శించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఈ ఆరోపణపై సీఎం భగవంత్ మాన్ ఇంకా స్పందించలేదు.
Shocking revelation-
CM Badal had 33 vehicles when he was CM from 2007-17 in his cavalcade & there was no change in number of vehicles when Captain Amarinder S became the CM but it has been revealed through RTI that CM Mann “The so called Aam Aadmi” has 42 cars in his cavalcade. pic.twitter.com/lEFt6Ve3xm
— Partap Singh Bajwa (@Partap_Sbajwa) September 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

