అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) కు అంతర్జాతీయ గౌరవం ( International honor ) దక్కింది. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయులైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సైన్సె’ లోని ‘ టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ ‘ కెంజుట్సూ’లో అధికారికంగా ప్రవేశం పొంది ఈ ఘనతను సాధించారు. కరాటే, యుద్ధకళల్లో శిక్షణ పొందడంతో పాటు జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపలై అధ్యయనం చేసి వాటిని పవన్ కల్యాణ్ అనుసరించారు. ఈ సందర్భంగా ఆయన నటించిన పలు సినిమాల్లోనూ వాటిని ప్రదర్శించారు.