Virat Kohli : ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒకడైన అంతర్జాతీయ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. ఈమధ్య వన్డేల్లో వరుస సెంచరీలతో రికార్డులు నెలకొల్పిన విరాట్.. ఈసారి 28 వేల పరుగుల క్లబ్లో చేరాడు. వడోదరలో న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ మైలురాయికి చేరుకున్నాడు. తద్వారా ఈ అరుదైన క్లబ్లో చేరిన మూడో ఆటగాడిగా అవతరించాడు కోహ్లీ.
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డుల పర్వం కొనసాగుతోంది. ఈమధ్యే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు శతకాలతో వన్డేల్లో తనకు తానే సాటి అని నిరూపించిన అతడు.. 28వేల పరుగులు సాధించాడు. అతడికంటే ముందు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), కుమార సంగక్కర(శ్రీలంక దిగ్గజం) మాత్రమే 28వేల పరుగులు పూర్తి చేసుకున్నారు.
2⃣8⃣,0⃣0⃣0⃣ international runs..
..And counting!
Congratulations, Virat Kohli 👏👏
Updates ▶️ https://t.co/OcIPHEpvjr#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/dOHh3l6dvW
— BCCI (@BCCI) January 11, 2026
అయితే.. కోహ్లీ 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సొంతం చేసుకోగా.. సచిన్ 644 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అంటే.. మాస్టర్ బ్లాస్టర్ కంటే20 ఇన్నింగ్స్‌ల కంటే ముందే విరాట్ ఈ క్లబ్లో చేరాడు. శ్రీలంక వెటరన్ సంగక్కరకు 666 ఇన్నింగ్స్‌ల్లో 28 వేల రన్స్ సాధించాడు.