Sircilla | సమైక్య పాలనలో చతికిల పడ్డ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు జీవం పోసింది. దేశం లో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి సాంచాలకు పూర్వవైభవం తీసుకొచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో చేతి నిండా పనిలేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. ఆకలి, అప్పుల బాధలతో అనేక మంది అర్ధంతరంగా తనువులు చాలించారు.