ఒకరు విశేష అనుభవాన్ని సంపాదించుకుని ఇక త్వరలోనే రిటైర్ అవ్వాలని భావిస్తున్న సీనియర్ పైలట్. మరొకరేమో పౌర విమానయాన కెరీర్లో అద్భుతాలు సృష్టించాలని ఎన్నో కలలతో అదే రంగాన్ని ఎంచుకున్న జూనియర్ పైలట్.
తన కూతురు విమానం నడిపే పైలట్ ఉద్యోగం సాధించిందని ఓ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. ఏకంగా తన కిరాణా దుకాణంలో పనిచేసే సిబ్బందిని విమానం ఎక్కించి తిరుమల తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు.