ఇది సంసార సంబంధమైన సామెత. భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించిన వ్యవహారం. ఎన్ని సంపదలున్నా.. ఎంతపెద్ద ఉద్యోగం చేసినా.. ఇంటికి వెళ్లాక భార్యాపిల్లల ప్రేమాభిమనాలు అందకపోతే ఇల్లు నరకంగా మారుతుంది.
కొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అన్నీ తెలిసే చేయాల్సిన తప్పులన్నీ చేస్తారు. తీరా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక.. ముందే ఎందుకు చెప్పలేదని ఎదురుదాడికి దిగుతారు.
సవాయ్ పని ఏడుంది బేటా. ఆ రోజులన్నీ పోయినయ్. మా కాలంల ఒకలకొకలం సవాయ్ కైకిలికి పొయ్యేది. ఇప్పుడంతా పైసతోనే పని. సవాయ్ పనే లేదు. ఆ మంచితనం అసలే లేదు’ అంటుంటారు పెద్దలు.