ఈ ఏడాది మన దేశం నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందింది ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ఈ డాక్యుమెంటరీని గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించారు.
95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్స్ గోల్డిన్ థియేటర్ వేదికగా ఈ నామినేషన్స్‌ను వెల్లడించారు.