95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్స్ గోల్డిన్ థియేటర్ వేదికగా ఈ నామినేషన్స్‌ను వెల్లడించారు. అందరి అంచనాలను అందుకుంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్‌కు ఎంపికైంది. భారత్ నుంచి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నామినేషన్ పొందాయి. ఈ నామినేషన్స్ నుంచి ఎంపికైన విజేతలు మార్చి 13న లాస్ఎంజెలీస్ డాల్బీ థియేటర్లో పురస్కారాలు అందుకుంటారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో 95వ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు సంపాదించుకుంది. కార్టికి గాన్సాల్వ్స్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరినీ 41 నిమిషాల నిడివితో తెరకెక్కించారు. తమిళనాడులోని ముడుమలై టైగర్ రిజర్వ్ నేపథ్యంలో నడుస్తుంది. అడవి, వన్యప్రాణుల పట్ల ఎంతో మమకారం ప్రదర్శించే బొమ్మన్, బెల్లీ దంపతులు రఘు అనే ఆనాథ ఏనుగు సంరక్షణ బాధ్యతల్ని తీసుకుంటారు. ఏనుగును సంరక్షించే క్రమంలో ఆ దంపతులు దానితో పెంచుకునే అనుబంధం, ఈ క్రమంలో జరిగే సంఘటనలతో ఈ డాక్యుమెంటరీ మానవీయ కోణంలో సాగుతుంది. ఈ డాక్యుమెంటరీలో అడవి, మనిషి, మూగజీవికి మధ్య ఉండే విడదీయలేని అనుబంధాన్ని దృశ్యమానం చేశారు. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘ఆల్ దట్ బ్రీత్స్’ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు సంపాదించుకుంది. ఢిల్లీకి చెందిన నిర్మాత షౌనక్ సేన్ రూపొందించిన ఈ డాక్యుమెంటరిలో ఢిల్లీ నగరంలో పక్షులను రక్షించడానికి ఇద్దరు అన్నదమ్ములు నదీమ్ షెహజాద్, మహమ్మద్ సౌద్ ఎలాంటి బాధ్యతల్ని తీసుకున్నారనే అంశాన్ని ఆవిష్కరించారు.
‘ఆర్ఆర్ఆర్’కు ప్రత్యేక ఆకర్షణగా
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందించిన ‘నాటు నాటు’ పాట ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలకు చంద్రబోస్ సన్నివేశానికి తగ్గ తెలుగు పదాలతో అందమైన సాహిత్యాన్ని అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గానంతో పాటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ప్రేమ్క్ష్రిత్ కొరియోగ్రఫీ చేశారు. పాటలో హుక్‌స్టెప్ కోసం 80పైగా వేరియేషన్ స్టెప్స్‌ను ప్రేమ్ రక్షిత్ బృందం డిజైన్ చేసిందట. చివరికి భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిలించే స్టెప్‌ను ఫైనల్ చేశారు. ఇద్దరూ ఒకే విధంగా స్టెప్ వేయడానికి 18 టేక్‌లు తీసుకున్నారట. ఈ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు.
నామినేషన్స్ ఇవే..
ఉత్తమ చిత్రం
ఉత్తమ నటుడు
ఉత్తమ నటి
బెస్ట్ ఒరిజినల్ సాంగ్