CBSE | తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ ఎగ్జామ్స్‌ను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. జూన్ 25న ఈ నిర్ణయాన్ని బోర్డ్ పాలక మండలి ఆమోదించింది.
పది, పన్నెండో తరగతుల పరీక్షా విధానంలో మార్పులు, సిలబస్ తగ్గింపు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఖండించింది.