న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతుల పరీక్షా విధానంలో మార్పులు, సిలబస్ తగ్గింపు గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఖండించింది. సిలబస్‌ను 15 శాతం వరకు తగ్గిస్తున్నారని, 10, 12 తరగతుల పరీక్షలను 2025లో ఓపెన్ బుక్ విధానంలో నిర్వహిస్తారంటూ వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని, వాటిని నమ్మొద్దని సీబీఎస్ఈ తెలిపింది.
మంగళవారం ఈ మేరకు సీబీఎస్ఈ ప్రాంతీయ ఆఫీసర్ వికాస్కుమార్ అగర్వాల్ ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో వచ్చే పోస్టులను నమ్మొద్దని విద్యార్థులను కోరారు. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారంపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.