5జీ స్మార్ట్‌ఫోన్ పరిధిని మరింత విస్తరించుకోవడానికి నోకియా మరో మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్30 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.48,999గా నిర్ణయించింది.
భారత్‌లో నోకియా ఎక్స్30 5జీ సేల్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయి. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా కస్టమర్ల ముందుకొస్తున్న నోకియా ఎక్స్30 5జీ ఓఐఎస్ ఆధారిత 50 ఎంపీ కెమెరాతో ఆకట్టుకోనుంది.