పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ పేర్కొంది. ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజద్రోహంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది.
మోదీ సర్కార్ తీసుకొస్తున్న కొత్త ఐటీ రూల్స్‌తో జర్నలిజానికి ముప్పు తప్పదని ప్రముఖ పాత్రికేయుడు, ద హిందూ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ ఆందోళన వ్యక్తం చేశారు.